షేర్: f 𝕏 ✉ ✈ in @
dishadailynews.in 12 ఫిబ్ర 2026, 9:58 సా.
తెలంగాణ

CM Revanth Reddy | తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి..నాకు ఎవరూ పోటీ లేరు?

* “తెలంగాణకు నేనే రాజు” అంటూ సీఎం ధీమా* 2029లో జమిలి ఎన్నికలపై అంచనా* ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ దశలో ఉందని వెల్లడి*…
ప్రచురణ తేదీ: 12 ఫిబ్ర 2026, 9:58 సా. రచన: Mr.360
4 వీక్షణలు 0 వ్యాఖ్యలు

* “తెలంగాణకు నేనే రాజు” అంటూ సీఎం ధీమా
* 2029లో జమిలి ఎన్నికలపై అంచనా
* ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ దశలో ఉందని వెల్లడి
* 2027 వరకు జిల్లాల విభజనలో మార్పులు లేవని స్పష్టం

CM Revanth Reddy :ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ, పరిపాలన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఇక్కడ పోటీ లేదు” అంటూ తన నాయకత్వంపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తెలిపారు.

దేశంలో ఎన్నికల సంస్కరణలపై స్పందిస్తూ, 2029లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశముందని అంచనా వేశారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి ఆరు నెలలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తదుపరి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజకీయ కక్ష సాధింపులు తమ ప్రభుత్వ విధానం కాదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ దశకు చేరుకుందని, అన్ని చర్యలు ఆధారాలతోనే ఉంటాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణలో కేంద్రం జాప్యం చేస్తున్నదని ప్రశ్నించారు.

2027 వరకు జిల్లాల విభజనలో మార్పులు ఉండవని, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరిగే అవకాశముందని తెలిపారు.

ALSO READ:Indian Railway: రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక.. మార్చి 1 నుంచి ఈ సేవలు బంద్..

#తెలంగాణ #తెలంగాణరాజకీయాలు
* “తెలంగాణకు నేనే రాజు” అంటూ సీఎం ధీమా* 2029లో జమిలి ఎన్నికలపై అంచనా* ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ దశలో ఉందని వెల్లడి* 2027 వరకు జిల్లాల విభజనలో…