Pending Traffic Challans: పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపెట్టవద్దని హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది( high court orders).
చలాన్లు చెల్లించాలంటూ బైక్ కీలు తీసుకోవడం, వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. వాహనం తనిఖీ సమయంలో వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లించాలనుకుంటే మాత్రమే పోలీసులు వసూలు చేయవచ్చని పేర్కొంది.
వాహనదారులు చలాన్లు చెల్లించేందుకు అంగీకరించని పరిస్థితుల్లో, చట్ట ప్రకారం కోర్టు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచించింది.
ట్రాఫిక్ పోలీసులు బలవంతంగా చలాన్లు వసూలు( Vehicle Challans) చేస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.
పెండింగ్ చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
వాదనలు విన్న న్యాయస్థానం ట్రాఫిక్ పోలీసుల విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ALSO READ:Donald Trump Davos Meet: ట్రంప్ డిన్నర్‌కు భారత బిజినెస్ దిగ్గజాలు…!