షేర్: f 𝕏 ✉ ✈ in @
dishadailynews.in 22 జూలై 2026, 4:06 సా.
తెలంగాణ

TGPSC: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 290 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

TGPSC Recruitment 2026: Notification Released for 290 Engineering Posts in Telangana
ప్రచురణ తేదీ: 22 జూలై 2026, 4:06 సా. రచన: sirasritha
6 వీక్షణలు 0 వ్యాఖ్యలు
TGPSC: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 290 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 290 ఖాళీల భర్తీ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

నోటిఫికేషన్‌ ప్రకారం రోడ్లు మరియు భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో (పీసీబీ) 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 6 నుంచి జులై 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 8 నుంచి జులై 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక కాలుష్య నియంత్రణ మండలిలోని అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షల వివరాలు తదితర పూర్తి సమాచారం కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి ఎం. హరిత ఒక ప్రకటనలో సూచించారు.

#తెలంగాణ
TGPSC Recruitment 2026: Notification Released for 290 Engineering Posts in Telangana