AI Boom 2028: AI బూమ్‌తో ఉద్యోగాలు ఔట్? 2028లో మార్కెట్ కుప్పకూలుతుందా!

sirasritha
రచయిత:

అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు అవుతుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు మార్కెట్లను వణికిస్తోంది. 2023లో జేమ్స్ వాన్ గీలెన్ స్థాపించిన Citrini Research విడుదల చేసిన తాజా హైపోతెటికల్ రిపోర్ట్ పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేపింది. “2028 Global Intelligence Crisis” పేరుతో వచ్చిన ఈ నివేదికలో AI అభివృద్ధి వేగంగా కొనసాగితే వైట్‌కాలర్ ఉద్యోగాలు భారీగా తగ్గి, ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని హెచ్చరించింది.

అమెరికాలో 18 నెలల్లోనే 5 శాతం వైట్‌కాలర్ ఉద్యోగాలు పోవచ్చని అంచనా వేసింది. ఉద్యోగ కోతల వల్ల వినియోగ ఖర్చులు తగ్గి, గ్రోత్ స్లో అవుతుందని చెప్పింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2026 అక్టోబర్ పీక్‌ నుంచి S&P 500 38 శాతం పడిపోయే అవకాశం ఉందని రిపోర్ట్ ఊహించింది. ఈ వార్త వైరల్ కావడంతో ప్రపంచ మార్కెట్లు రెండో రోజు వరుసగా కుదేలయ్యాయి. భారత ఐటీ షేర్లపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా Infosys, TCS, Wipro షేర్లు భారీగా పడిపోయాయి.

AI కోడింగ్ ఏజెంట్ల ఖర్చు విద్యుత్ ఖర్చు స్థాయికి పడిపోతే భారత ఐటీ సర్వీసెస్ మోడల్ దెబ్బతింటుందని నివేదిక హెచ్చరించింది. 2028 నాటికి సేవల అధిక్యం తగ్గిపోతే రూపాయి విలువ నాలుగు నెలల్లోనే 18 శాతం పడిపోవచ్చని పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారితే భారత్ International Monetary Fund (IMF)తో ప్రాథమిక చర్చలు జరపాల్సి రావచ్చని కూడా ఊహించింది.

అయితే మార్కెట్ నిపుణులు ఈ నివేదికను అతిశయోక్తిగా కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ AI వల్ల వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయొద్దని Citrini హెచ్చరిస్తోంది. ప్రభుత్వాలు AI వల్ల వచ్చే అదనపు లాభాలపై పన్ను విధించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. మొత్తానికి AI బూమ్ పెట్టుబడిదారులకు వరమా? శాపమా? అన్న చర్చ మళ్లీ వేడెక్కింది.

ఈ-పేపర్ క్లిప్ చూడండి