ఆటోమేకర్లు ఫిబ్రవరి 2026కు సంబంధించిన అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. అన్ని బ్రాండ్లు గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించాయి. టయోటా గత నెలలో 30,000 వాహనాలను అమ్మగా, హ్యుందాయ్ ఫిబ్రవరి 2026లో అత్యుత్తమ అమ్మకాలను నివేదించింది. మారుతి సుజుకి అమ్మకాల్లో టాప్లో నిలిచింది.
మారుతి సుజుకి అమ్మకాలు
మారుతి సుజుకి ఫిబ్రవరి 2026లో మొత్తం అమ్మకాలు 2,13,995 యూనిట్లుగా నమోదు చేసింది. 7.31 శాతం వార్షిక వృద్ధి సాధించింది. గత సంవత్సరం ఇదే నెలలో 1,99,400 యూనిట్లు అమ్మింది. ఈ కంపెనీ 39,155 వాహనాలను ఎగుమతి చేసింది. దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,61,000 యూనిట్లు, LCV అమ్మకాలు 3,130 యూనిట్లుగా ఉన్నాయి. మినీ, కాంపాక్ట్ విభాగంలో 76,624, యుటిలిటీ వెహికల్ విభాగంలో 72,720 వాహనాలు అమ్మింది.
టాటా మోటార్స్ అమ్మకాలు
టాటా మోటార్స్ ఫిబ్రవరి 2026లో మొత్తం అమ్మకాలు 63,331 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 46,811 యూనిట్లు అమ్మింది. అమ్మకాల వృద్ధి 35 శాతంగా ఉంది. డీలర్షిప్లకు 62,329 వాహనాలు పంపింది. 1,002 వాహనాలు ఎగుమతి చేసింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో 8,385 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది.
హ్యుందాయ్ అమ్మకాలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరి 2026లో మొత్తం 66,134 యూనిట్లు అమ్మింది. అమ్మకాల వృద్ధి 12.6 శాతంగా ఉంది. దేశీయ అమ్మకాలు 52,407 యూనిట్లు, 13,727 వాహనాలు ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది.
టయోటా అమ్మకాలు
టయోటా ఫిబ్రవరి 2026లో మొత్తం 34,034 వాహనాలు అమ్మింది. గత ఏడాది ఇదే నెలలో 28,414 యూనిట్లు అమ్మింది. 20 శాతం వృద్ధి సాధించింది. దేశీయ మార్కెట్లో 30,737 యూనిట్లు విక్రయించింది. 3,297 వాహనాలు ఎగుమతి చేసింది.
కియా అమ్మకాలు
కియా ఇండియా ఫిబ్రవరిలో ఇప్పటి వరకు అత్యధికంగా 27,610 యూనిట్లు అమ్మింది. 10.3 శాతం అమ్మకాల వృద్ధి సాధించింది. గత సంవత్సరం ఇదే నెలలో 25,026 వాహనాలు విక్రయించింది. సోనెట్ కాంపాక్ట్ SUV విభాగంలో బాగా అమ్మకాలు జరిగాయి. సెల్టోస్ కూడా మంచి అమ్మకాలు సాధించింది.
