Steel Plant Fire Accident | స్టీల్ ప్లాంట్‌లో పేలిన కొలిమి.. ఏడుగురు కార్మికుల దుర్మరణం

Mr.360
రచయిత:

* ఛత్తీస్‌గఢ్‌ బలోడా బజార్ జిల్లాలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
* బొగ్గు కొలిమి పేలడంతో ఏడుగురు కార్మికులు సజీ*వ ద*హనం
* మరో పది మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు
* ఘటనపై పోలీసులు, అధికారులు దర్యాప్తు ప్రారంభం

Chhattisgarh Steel Plant Accident: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బలోడా బజార్ జిల్లా(Chhattisgarh’s Baloda Bazar district)లో గురువారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బకులాహి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ రియల్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్‌(Steel Plant)లో బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీ*వ దహ*నమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ప్లాంట్‌లోని బొగ్గు కొలిమి ప్రాంతం చుట్టూ శుభ్రపరిచే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అకస్మాత్తుగా కొలిమి భారీ శబ్దంతో పేలిపోవడంతో మండుతున్న బొగ్గు, విపరీతమైన వేడిమి కార్మికులపై పడింది.

దీంతో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు తప్పించుకునే అవకాశం లేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read:EPFO New Portal: EPFO 3.0తో ఉద్యోగులకు పెద్ద గుడ్‌న్యూస్…PF సేవలు మరింత సులభం

ఈ-పేపర్ క్లిప్ చూడండి