VinFast Electric Scooters: 2026లో భారత్‌లోకి వియత్నాం కంపెనీ…1 మిలియన్ యూనిట్ల లక్ష్యంతో

Mr.360
రచయిత:

* VinFast నుంచి భారత మార్కెట్‌కు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు
* 2026 ద్వితీయార్థంలో విడుదలకు ప్రణాళిక
* తమిళనాడులో తయారీ ప్లాంట్, 1 మిలియన్ యూనిట్ల లక్ష్యం
* PLI, PM E-DRIVE పథకాల వినియోగంపై పరిశీలన

VinFast Electric Scooters : వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ “విన్‌ఫాస్ట్ (VinFast)” భారత ద్విచక్ర వాహన(TWO WHEELERS) మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండియాలో తన మొదటి కారును విడుదల చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు “ఎలక్ట్రిక్ స్కూటర్లను(electric scooters)” కూడా భారత మార్కెట్‌కు పరిచయం చేయాలని యోచిస్తోంది.

2026 ఆర్థిక సంవత్సరంలో (H2 2026) ఈ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రత్యేకత ఏమిటంటే, విన్‌ఫాస్ట్ విడుదల చేయబోయే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు గ్లోబల్ మోడల్స్ కావు. భారతీయ రోడ్లు, వినియోగ విధానాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని “భారతీయ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా డిజైన్” చేయనున్నట్లు విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ వెల్లడించారు.

భారత్‌లో దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా, ప్రతి సంవత్సరం “1 మిలియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడం” విన్‌ఫాస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తమిళనాడులో ఒక ప్రత్యేక తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. అక్కడే ఈ మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నారు.

భారత ప్రభుత్వ PLI, PM E-DRIVE పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా కూడా కంపెనీ పరిశీలిస్తోంది. దీని ద్వారా పెట్టుబడులు పెరగడమే కాకుండా, వినియోగదారులకు సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించే అవకాశం ఉంది. 2026 జూలై–డిసెంబర్ మధ్య ఈ స్కూటర్లు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

ఈ-పేపర్ క్లిప్ చూడండి