చైనా ఆటో దిగ్గజం Xiaomi తన ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ Xiaomi SU7 అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్టాండర్డ్, ప్రో, మాక్స్ అనే మూడు వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. డిజైన్ నుంచి పనితీరు వరకు అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
కొత్త SU7లో 5 మీటర్ల పొడవు, 3 మీటర్ల వీల్‌బేస్‌ను అలాగే కొనసాగించారు. అయితే చిన్న స్థాయిలో డిజైన్ అప్డేట్స్ చేశారు. వాటర్ డ్రాప్ హెడ్‌లైట్స్, హాలో స్టైల్ టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రత్యేక ఎలిమెంట్స్ కొనసాగించగా, కొత్త అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ రాడార్‌తో ఫ్రంట్ గ్రిల్‌ను జోడించారు. మొత్తం తొమ్మిది రంగుల్లో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.
ఇంటీరియర్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. మెరుగైన మెటీరియల్స్, లేఅవుట్ మార్పులతో క్యాబిన్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, అడ్జస్టబుల్ సీటింగ్ ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉంటాయి. వెనుక సీటింగ్‌లో కూడా కంఫర్ట్ పెంచారు. హైఎండ్ వేరియంట్లలో లామినేటెడ్ గ్లాస్, మెరుగైన సౌండ్ప్రూఫింగ్ అందుబాటులో ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 3 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం 265 కి.మీ వరకు ఉంటుంది. వేరియంట్‌ను బట్టి రేంజ్ 720 కి.మీ నుంచి 902 కి.మీ వరకు ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 15 నిమిషాల్లో 670 కి.మీ రేంజ్ పొందవచ్చు. 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ 12 నిమిషాల్లో పూర్తవుతుంది.
ఈ కారు అడాప్టివ్ సస్పెన్షన్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్లతో మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. స్టీరింగ్, బ్రేకింగ్, స్టెబిలిటీ సిస్టమ్స్‌లో అప్డేట్స్ వల్ల హ్యాండ్లింగ్ మరింత సాఫీగా ఉంటుంది. బలమైన స్టీల్ స్ట్రక్చర్, ఆధునిక సెన్సార్లు, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో భద్రతను పెంచారు.
అదనంగా, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, AI ఆధారిత వాయిస్ అసిస్టెంట్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు ఈ కారును టెక్నాలజీ పరంగా మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి.
