* డేవిడ్ వార్నర్ – టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక క్యాచ్‌లు
* ఏబీ డివిలియర్స్‌కు అత్యుత్తమ క్యాచ్-పర్-ఇన్నింగ్స్ రేషియో
* రోహిత్ శర్మ టాప్ 5లో చోటు దక్కించుకున్న ఏకైక భారత ప్లేయర్
* ఫీల్డింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చే కీలక అంశం
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్‌కు కీలకమైన స్థానం ఉంది. “క్యాచెస్ విన్ మ్యాచెస్”(Catches Win Matches) అనే సామెత ఈ ఫార్మాట్‌లో పూర్తిగా నిజమవుతుంది. ఒక్క క్యాచ్ మ్యాచ్ పూర్తిగా తలకిందులయ్యే ఆవకాశం ఉంటుంది. అందుకే “Catches Win Matches” అంటారు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా జట్టు విజయంలో సమానంగా పాత్ర పోషిస్తుంది.
ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఫీల్డర్ల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బౌండరీ లైన్ వద్ద అథ్లెటిక్ డైవ్‌లు, 30 యార్డుల సర్కిల్‌లో మెరుపు వేగంతో స్పందించడం ద్వారా ఈ ఫీల్డర్లు తమ జట్లకు కీలక విజయాలు అందించారు.
ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్(David Warner) 41 మ్యాచ్‌ల్లో 25 క్యాచ్‌లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఏబీ డివిలియర్స్(ABD) తక్కువ మ్యాచ్‌లు ఆడినా అత్యధిక క్యాచ్-పర్-ఇన్నింగ్స్ రేషియోతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతమైన డైవ్‌లతో మ్యాచ్‌ల గమనాన్ని మార్చాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ(Rohit Sharma) టాప్ 5లో చోటు దక్కించుకోవడం విశేషం. న్యూజిలాండ్ తరఫున మార్టిన్ గప్టిల్ తన సేఫ్ హ్యాండ్స్‌తో ఈ జాబితాలో నిలిచాడు.
ALSO READ:Danam Nagender | నా పార్టీ బీఆర్‌ఎస్….పార్టీ మారలేదన్న దానం నాగేందర్
