SS Rajamouli Marketing | ఒక్క హోర్డింగ్‌తోనే ‘వారణాసి’ రిలీజ్ డేట్ వైరల్

Mr.360
రచయిత:

* ఒక్క హోర్డింగ్‌తోనే ‘వారణాసి’ రిలీజ్ డేట్ వైరల్
* ఏప్రిల్ 7, 2027న సినిమా థియేటర్లలో విడుదల
* టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ
* మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు

Varanasi April 7: సినిమాకు హైప్ ఎలా క్రియేట్ చేయాలో మరోసారి నిరూపించారు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli Marketing). మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’(Varanasi ) సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఎలాంటి హడావుడి లేకుండా, ఒక్క ఫ్లెక్స్‌తో ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.

వారణాసి నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై “In Theatres April 7, 2027” అనే ఒక్క లైన్ మాత్రమే కనిపించగా, సినిమా పేరు, నటీనటుల వివరాలు ఏవీ లేకపోవడం విశేషం.

ఈ సైలెంట్ ప్రమోషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవిత్ర నగరమైన వారణాసిని ఎంపిక చేయడం వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ హోర్డింగ్ ద్వారా రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ముందుగా మార్చి చివర్లో రిలీజ్ అనుకున్నప్పటికీ, ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 7న విడుదలకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

‘వారణాసి’ ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా, భారత పురాణాల ఆధారిత టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనున్నారు.

విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.

ALSO READ: Medigadda Barrage : కేంద్రం సంచలన ప్రకటన.. కేటగిరీ-1 ప్రమాదకర డ్యామ్‌గా మేడిగడ్డ బ్యారేజీ

ఈ-పేపర్ క్లిప్ చూడండి